తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, అన్నవరం, యాదాద్రి వంటి ప్రముఖ దేవాలయాల్లో క్యూ కట్టారు. ఉత్తర ద్వారం దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలిరావటంతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో అర్ధరాత్రి 12 గంటలకే దర్శనాలు ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే వంటి ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.