తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న భ‌క్తులు

© ANI Photo

గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విప‌రీతంగా ఉంది. టోకెన్ల కోసం ఎగ‌బ‌డ‌టంతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ప‌లువురికి గాయాలయ్యాయి. దీంతో టీటీడీ అధికారులు ఎలాంటి స్లాట్‌లు లేకుండా సర్వ దర్శ‌నానికి అనుమ‌తించారు. దీంతో ప‌రిస్థితి కాస్త స‌ద్దుమ‌ణిగింది. తిరుపతిలో ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉండడంతో దాదాపు 10 వేల మంది భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం పరుగులు తీశారు. పోలీసులు కూడా ప‌రిస్థితిని నియంత్రించ‌లేక‌పోయారు. ఈ తోపులాటలో కొందరు భక్తులు తమ బంగారు ఆభరణాలను కూడా పోగొట్టుకున్నారు. దీనిపై భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలలోని వైకుంటం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. భ‌క్తుల్లో క్ర‌మ‌శిక్ష‌ణ లోపించ‌డం కార‌ణంగా ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దీనిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకొని ఆల‌యానికి వ‌స్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version