శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు వెళ్లలేకపోయిన భక్తులు స్వామివారి దర్శనానికి వరుస కడుతున్నారు. దీక్ష చేసిన వారితో పాటు మాములుగా వెళ్లేవారి తాకిడి ఎక్కువగానే ఉంది. కేవలం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు సుమారు 4 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మాలధారణ చేసిన బాలలు తప్పిపోకుండా కేరళ పోలీసులు వేస్తున్న ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి.