• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీజీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

    ఏపీ డీజీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఓ అసభ్యకరమైన చిత్రాన్ని అకౌంట్ నుంచి పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన టెక్నికల్ వింగ్ ఆ చిత్రాన్ని తొలగించింది. ట్విటర్ అకౌంట్‌ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే హ్యాక్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, 2020 నుంచి ఈ అకౌంట్ యాక్టివ్‌లో లేకపోవడం గమనార్హం. 2019లో గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో dgpapofficial పేరుతో ట్విటర్ అకౌంట్‌ని ఓపెన్ చేశారు. తాజాగా అశ్లీల చిత్రం పోస్టు చేయడంతో వైరల్ అయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.