సినిమా చిన్నదైనా పెద్దదైనా..కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు హిట్ ఇచ్చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ విషయంలోనూ అంతే.. చెవులకు ఇంపుగా అనిపించిందంటే.. చిన్న సినిమాలోని పాట అయినా యూట్యాబ్ ట్రెండింగ్ లో నిలుపుతున్నారు. తాజాగా సుకు పూర్వజ్ దర్శకత్వం వహించిన ‘మాటరాని మౌనమిది’ సినిమాలోని దంపుడు లక్ష్మి సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 1మిలియన్ వ్యూస్ దాటుకుని సంగీత ప్రియులను అలరిస్తోంది.