మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా ధనుష్

© ANI Photo(file)

హీరో ధనుష్ ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్లకు పైగా సినీ ప్రియుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఐఎండీబీ ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ధనుష్ మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం ఆలియా భట్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, రామ్‌చరణ్, సమంత, హృతిక్ రోషన్, కియారా అడ్వాణీ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యశ్ వరుసగా స్థానం సంపాదించారు. కాగా, ఈ ఏడాది ధనుష్ ‘ది గ్రే మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆలియా భట్ కూడా ‘హార్ట్ ఆఫ్ స్టోన్స్’ లో కీలక పాత్ర పోషిస్తోంది. RRRతో రామ్‌చరణ్, ఎన్టీఆర్; పుష్పతో అల్లు అర్జున్; కేజీఎఫ్‌తో యశ్ పాపులారిటీ సంపాదించారు.

Exit mobile version