టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తగిన గుర్తింపు లభించట్లేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్, రోహిత్ శర్మలపైనే అందరి దృష్టి ఉందని చెప్పాడు. ‘శిఖర్ ధావన్ సహజంగానే దూకుడైన ఆటగాడు. వన్డేల్లో అతడికి మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు ముఖ్యమైన మ్యాచుల్లోనూ రాణించాడు. అతడి ఆటతీరుకు తగిన గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం అతడి చుట్టూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లున్నారు. కానీ, అనుభవం రీత్యా ధావన్‌కు తగిన గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని రవిశాస్త్రి చెప్పాడు.