మహేంద్ర సింగ్ ధోనీ ఈ పేరు వింటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీకి ఉన్న అభిమానుల సంఖ్యకు లెక్కే లేదు. నిన్న ధోనీ సేన ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో ధోనీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో ఫినిషర్ గా వచ్చి 2500 పరుగులు చేసిన వ్యక్తిగా ధోనీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతవరకు ఏ ఆటగాడికి కూడా సాధ్యపడలేదు. కేవలం ధోనీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఇక నిన్నటి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మీద ధోనీ సేన ఘన విజయం సాధించింది.