ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నైసూపర్ కింగ్స్ ఒకటి. తొలి ఎడిషన్ నుంచి ఎం.ఎస్.ధోనీ కెప్టెన్సీ వహించి జట్టును అగ్రపథాన నిలిపాడు. అయితే, ధోని కెప్టెన్సీలో జట్టుకు ప్రాతినిథ్యం వహించి కోచ్‌లుగా ఎదిగిన వారున్నారు. వారిలో వసీం జాఫర్(పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్), ఆశిశ్ నెహ్రా(గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్), మైక్ హస్సీ(సీఎస్కే బ్యాటింగ్ కోచ్), డ్వేన్ బ్రావో(సీఎస్కే బౌలింగ్ కోచ్), స్టీఫెన్ ఫ్లెమింగ్(సీఎస్కే హెడ్ కోచ్). ఈ ఐదుగురూ కొన్ని ఎడిషన్లలో సీఎస్కే తరఫున ఆడారు. ఇప్పుడు అగ్రగణ్యులుగా ఎదిగారు. ‘ధోనీ అంటే అలా ఉంటుంది మరి’ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.