కోళ్ల పెంపకం చేపట్టనున్న ధోని

Courtesy Instagram: dhoni

టీమిండియా స్టార్ క్రికెటర్ ఎం.ఎస్ ధోని కోళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆరోగ్యానికి మంచి చేసే 2000 కడక్ నాథ్ జాతి కోళ్ల పెంపకం చేపట్టనున్నాడు. ఇప్పటికే ఈ జాతి కోళ్లు తన ఫారానికి చేరుకున్నాయి. ఓ సహకార సంఘ సంస్థ సహాయంతో ధోని కోళ్ల పెంపకం చేపట్టనున్నాడు. కరోనా కంటే ముందే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని భావించినా.. లాక్‌డౌన్ సమయంలో బర్డ్ ఫ్లూ కారణంగా చాలా కోళ్లు చనిపోవడంతో అది సాధ్యపడలేదు. కాగా ఈ కోడి ధర రూ.1000పైగా ఉండనుండగా.. ఈ కోడి ఒక్కో గుడ్డు ధర రూ.50-60 ఉంటుంది.

Exit mobile version