ఒకప్పుడు ధోనీ నేర్పిన వ్యూహంతోనే ఇండియాను సఫారీలు దెబ్బకొట్టారని టీమిండియా మాజీ ప్లేయర్ అజయ్ జడేజా అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి తప్పు చేసే వరకు ఎదురు చూసి చెలరేగడమనే వ్యూహాన్ని ధోనీ నేర్పిందేనని చెప్పారు. ‘ప్రత్యర్థి చేతికి ముందే మనం చిక్కకూడదు. ఎదుటివారు తప్పు చేసే వరకు మనం వేచి ఉండాలి. తొందరిపడి మనం తప్పటడుగు వేయొద్దు. ఇదే ధోనీ నేర్పిన పాఠం. విచిత్రంగా డేవిడ్ మిల్లర్ ఈ వ్యూహాన్ని భారత్‌పై అనుసరించాడు. అద్భుతంగా ఆడి టీమిండియాను దెబ్బకొట్టాడు’ అని జడేజా గుర్తుచేశారు.
‘ధోనీ వ్యూహంతో మనపై గెలిచారు’

© ANI Photo