సంవత్సరం లోపల ఉన్న చిన్నారుల్లో విరేచనాలు అవడంతో పోషకాహారం లోపిస్తుంది. తద్వారా బుద్ధి మందగించండం, ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో హైదరాబాద్లో చేపట్టిన డయేరియా క్యాంపులు, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో విజయవంతంగా కొనసాగుతుండడంతో.. రాష్ట్రంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు పిల్లల వివరాలు తీసుకోవాలని ANMలు, ఆశాలకు ప్రభుత్వం సూచించింది.