YouSay Short News App

హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు  హిట్ కొట్టాడా?

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం  దక్కిందా? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.

మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

కథ

థ్రిల్లర్ నేపథ్యంలో సాగే స్టోరీలోకి వేగంగా జనాల్ని తీసుకెళ్లాలి. ఇందులో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చిత్రం మెుదలుపెట్టగానే సుధీర్ బాబు, భరత్, శ్రీకాంత్ పాత్రల్ని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో భరత్ హత్యకు గురికావటం, దాన్ని చేధించడంతో ముందుకెళ్లిన తీరు బాగుంది.

ఆలస్యం లేదు

హీరో ప్రమాదానికి గురి కావటం తర్వాత తనని తాను వెతుక్కుంటూ కేసును పరిష్కరించడం ఆకట్టుకున్నా తర్వాత సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. హీరో ఆధారాలు వెతుక్కుంటూ వెళ్లటం అస్సలు బాగాలేదు.

కూర్చోవటం కష్టమే

చిత్రంలో భరత్, శ్రీకాంత్ పాత్రలతో హీరోకున్న సన్నివేశాలతో దర్శకుడు బ్యాక్‌డ్రాప్ రాసుకున్నాడు. ఇది ప్రేక్షకులకు పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్‌లో ఉండే ట్విస్ట్‌లు కనిపించవు.

బోరింగ్ బ్యాక్‌డ్రాప్‌

సినిమాలో ఆకట్టుకునేది ఏదైనా ఉందంటే  ప్రీ క్లైమాక్స్ ఒక్కటే. ఇక్కడ వచ్చే ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు కాస్త థ్రిల్‌ ఫీలవుతారు.

ప్రీక్లైమాక్స్

ఇక పతాక సన్నివేశాలను కూడా దర్శకుడు చకచకా ముగించేశాడు. ఇందులో ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. సాధారణ ప్రేక్షకులకు బోరింగ్ క్లైమాక్స్‌ అనే ఫీలింగ్ వస్తుంది.

పతాక సన్నివేశాలు

సుదీర్ బాబు మరోసారి నటనతో మెప్పించాడు. యాక్షన్, పోలీస్‌ అధికారి పాత్రలో సూపర్‌గా అదరగొట్టాడు. భరత్, శ్రీకాంత్ పరిధిమేరకు నటించారు.

ఎవరు ఎలా చేశారు?

దర్శకుడు స్క్రీన్‌ ప్లేను మరింత గ్రిప్పింగ్‌ మార్చుకుంటే బాగుండేది. రసవత్తరంగా కథను నడిపించడంలో విఫలమయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే.

సాంకేతిక పనితీరు

కథ సుధీర్‌ బాబు నటన యాక్షన్

బలాలు

రేటింగ్ : 2.5/5

స్క్రీన్‌ ప్లే

బలహీనతలు