ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి క్రికెట్ ఆడుతూ మృతిచెందాడు. ఉన్నట్టుండి మైకం కమ్మడంతో 16ఏళ్ల అనుజ్ గ్రౌండులోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే అనుజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, గుండెపోటు వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఈ నెల 7న చోటుచేసుకుంది. అనుజ్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించకుండా కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి అనంతలోకాలకు పయనమైన తమ కుమారుడిని తల్చుకుని తల్లిదండ్రులు శోకసంద్రమయ్యారు.