తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న భాజపాకు అంతర్గత పోరు తలనొప్పిగా మారింది. ఇప్పటికే బండి సంజయ్‌కు ప్రాధాన్యం పెరగటం కొందరి నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఈటల, వివేక్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. దీంతో కేంద్రమంత్రి వద్దకు పంచాయితీ వెళ్లగా.. ఇద్దరు అరుచుకున్నారని సమాచారం. అక్కడికి తెలంగాణ మంత్రి రావటంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారని వినికిడి.