అనకాపల్లి జిల్లాలో వైకాపా నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్గం నుంచి నిరసన సెగ తగిలింది. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కన్నబాబు అచ్యుతాపురం మండలం దొప్పర్లలో పర్యటించారు. ఈ క్రమంలో అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపాలో రచ్చకెక్కిన విభేదాలు

© ANI Photo