దేశంలో ‘డిజి యాత్ర’ అందుబాటులోకి వచ్చింది. విమాన ప్రయాణాల్లో ప్రయాసను తగ్గించేందుకు కేంద్రం దీనిని అమలు చేస్తోంది. ఇకపై ప్రయాణికులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో సులభంగా చెక్ పాయింట్లు దాటుకుంటూ వెళ్లిపోవచ్చు. ప్రతిసారి పేపర్లు చూపిస్తూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. తొలి దశలో కేవలం దేశీయ ప్రయాణాలకు మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నారు.దిల్లీ, బెంగళూరు, వారణాసి ఎయిర్‌పోర్టుల్లో నేటి నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్, కోల్‌కతా, పుణే, విజయవాడలో 2023 కల్లా ప్రారంభిస్తారు. ఈ సేవల కోసం ఆధార్ కార్డ్ సాయంతో డిజి యాత్ర యాప్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.