ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు

Courtesy Instagram: ramcharan

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఒక సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ జిమ్‌లో చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న లుక్‌ను మొత్తం మార్చేశాడు. అయితే గ‌త కొంత‌కాలంగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టులు న‌టిస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజాలు లేవు. ఈ సినిమాలో న‌టీన‌టులు ఎంపిక ఏ వ్య‌క్తికి, ఏజెన్సీ చేతిలో లేద‌ని స్ప‌ష్టం చేసింది. ద‌య‌చేసి ఇలాంటి త‌ప్పుడు వార్త‌లను వ్యాపింప‌చేయ‌వ‌ద్ద‌ని కొరింది.

Exit mobile version