‘అగ్నిపథ్’ స్కీం కారణంగా ఆర్మీ అభ్యర్థులు నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రైలు భోగీలకు నిప్ప్పు పెట్టడంతో పాటు, రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను, స్టాళ్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో భారీగా నష్టం చోటు చేసుకుంది. దీనిపై సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా స్పందించారు. ఈ అల్లర్ల కారణంగా ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. రైళ్ల రద్దుతో టిక్కెట్ల డబ్బులను ప్రయాణికులను రిఫండ్ చేస్తామని ప్రకటించారు.