• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో 17% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

    దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాదితో పోలిస్తే 17 శాతం మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.13.73 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 10 వరకు స్థూలంగా మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. అందులో రూ.2.95 లక్షల కోట్ల రిఫండ్లు పోగా రూ.13.73 లక్షల కోట్లు నికరంగా వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ మొత్తం 96.67 శాతానికి సమానం. 2022-23 సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం వసూళ్లు 83.19 శాతంగా నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది.