F3 మూవీ ప్రమోషన్స్‌లో తమన్నా పాల్గొనకపోవడానికి ఆమెకు డైరెక్టర్ అనీల్ రావిపుడితో వచ్చిన విభేదాలే కారణమని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడి దీనిపై క్లారిటీ ఇచ్చారు.సెట్‌లో అంతమంది ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని విభేదాలు వస్తుంటాయి. ఒకరోజు షూట్ ఇంకా ముగిసిపోలేదు అప్పుడే తమన్నా నాకు టైమ్ అయింది వెళ్లాలి.. మార్నింగ్ మళ్లీ జిమ్ చేసుకోవాలని చెప్పింది. కానీ ఆరోజు షాట్ పూర్తిచేసేదాకా పంపించలేదు. దీంతో ఆమె రెండురోజులు కోపంగా ఉన్నమాట నిజమే. కానీ ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడానికి అది కారణం కాదు. ఆ సమయంలో ఆమె విదేశాల్లో ఉందని అనీల్ రావిపూడి స్పష్టం చేశాడు. ఏం జరిగినా నాకు అన్నింటికన్నా సినిమానే ఎక్కువ కాబట్టి ఎక్కువగా పట్టించుకోను. ఏదైనా మనస్పర్థలు వచ్చినా వెంటనే పరిష్కరించుకుంటాను అని చెప్పాడు.