‘ఆదిపురుష్’ గురించి దర్శకుడు ఓం రౌత్ మాటల్లో

Courtesy Instagram:

ఓం రౌత్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. సైఫ్ అలీ ఖాన్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప‌లు వివాదాలు సైతం న‌డుస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ “నాపై గొప్ప ప్రభావాన్ని చూపిన రాముడి ‘పరాక్రమ’ (వైభవం మరియు వైభవం) పార్శ్వాన్ని మాత్ర‌మే నేను చిత్రీకరిస్తున్నాను” అని పేర్కొన్నాడు. ప్రభాస్, సైఫ్ వంటి స్టార్‌లతో షూటింగ్ చేయ‌డం తనకు గొప్ప అనుభవం అని చెప్పాడు. కాగా ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉండ‌గా.. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం విడుదలను వాయిదా వేసి జనవరి 12, 2023న రిలీజ్ చేయ‌నున్నారు.

Exit mobile version