టాలీవుడ్ మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ముప్పవరపు నిశ్చిత రాసిన ‘ఆమె..ఆకాశం’ అనే పుస్తకం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రముఖుల సమక్షంలో విడుదలైంది. ఈ పుస్తకంలోని ముందు మాటను రచయిత్రి ఓల్గా రాశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్, సంగీతకారుడు శివమణి, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్ కాలం, ధర్మం, సత్యం గురించి మాట్లాడారు. కాలం, ధర్మం మారినా సత్యం అలాగే ఉంటుందని పేర్కొన్నారు. పుస్తకం తేలిగ్గా ఉన్నా, భావం బరువుగానే ఉందని పుస్తకం గురించి వివరించారు. ఈ పుస్తకాన్ని తాము కూడా చదివామని రచయిత్రి నిశిత వృత్తిపరంగా వైద్యురాలయినా స్త్రీ కోణంలో పుస్తకాన్ని రాసిందని పలువురు కొనియాడారు.