ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు లేవు. పలు ప్రాంతాలు, గ్రామాల్లో ఏదైనా సమస్య, గొడవ వస్తే గ్రామ పెద్దలే పరిష్కరిస్తారు. వారు చెప్పిందే వేదం. ఈ క్రమంలో ఏపీలో ఇటీవల ఆ పెద్దల తీర్పు కారణంగా ఓ వికలాంగుడి ప్రాణం పోయింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా రేగుల గూడెం ప్రాంతంలో చోటుచేసుకుంది. అదే గ్రామంలో ఓ వ్యక్తిని మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో కొట్టగా అతను మృతి చెందాడు. ఈ ఘటనపై ప్రాణానికి ప్రాణమని పెద్దలు తీర్పు ఇవ్వగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మతిస్థిమితం లేని వ్యక్తికి మొదట విషం ఇచ్చారు. అయినా బతకడంతో ఉరివేసి కాల్చి చంపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు.