‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరోసారి పోలీసులు అనుమతి నిరాకరించారు. తొలుత ఆర్కే బీచ్‌లో వేడుక నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే, కొన్ని కారణాల వల్ల పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు అధికారులు ఒకే చెప్పారు. అయితే, మళ్లీ ఆర్కే బీచ్‌లో వేడుక ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తున్న సమయంలో పోలీసులు మళ్లీ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో నిర్వాహకులకు పాలుపోవట్లేదు. రేపే ఈవెంట్ ఉండటంతో సమాలోచనలో పడ్డారు.