ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలానా చెల్లించని వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు చలాన్లలో రాయితీ ఇస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అందులో భాగంగా టూ వీలర్ బండ్లకు 75శాతం రాయితీ లభించనుండగా.. హెవీ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ అందనుంది. అయితే ఈరోజు నుంచి వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్‌పే, గూగుల్ పేలతో కూడా చలాన్లు చెల్లించుకోవచ్చని తెలిపారు. దీంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారుని ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు.