కరోనాకు మించిన మరో వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించబోతోంది. డిసీజ్-ఎక్స్ కేసులు ప్రస్తుతం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూశాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ కేసులు విశ్వమంతా వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. డిసీజ్-ఎక్స్..ఎబోలా కంటే మరింత ప్రమాదకరమని వెల్లడించింది. ఈ వ్యాధి సోకినవారిలో దాదాపు 80 శాతం మంది మరణిస్తారని తెలిపింది. ఇది కరోనా కంటే ఎక్కువ ప్రాణ నష్టం సంభవించేలా చేస్తుందని పేర్కొంది.