నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్-K’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ భామ దిశా పటానీ కూడా ప్రాజెక్ట్ -K లో కనిపించబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మూవీలో భాగమవడం, ప్రభాస్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. దిశా పటానీ గతంలో తెలుగులో ‘లోఫర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.