అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చక్కటి విజయాన్న నమోదు చేసింది. ఈ సినిమాకు బన్నీ నటన, రష్మిక అందం, సుకుమార్ మేకింగ్ ప్లస్ అయ్యాయి. ఇక, ఈ సినిమాలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. సమంత చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్ పుష్ప సక్సెస్ లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ సాంగ్ కు సమంత కంటే ముందు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని సంప్రదించారట. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం సమంత వద్దకు వెళ్లింది. ఇక, ఈ సాంగ్ ఫుల్ సక్సెస్ అవడంతో పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కోసం దిశా ఓకే చెప్పారట. ఈ నేపథ్యంలో రెండో భాగంలో బన్నీతో కలిసి ఐటమ్ సాంగ్ లో ఈ బాలీవుడ్ భామ మెరవనుంది.