తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ పరీక్షలో కఠిన నిబంధనలు అమలు చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ప్రకటించింది. పరీక్షల పక్క అభ్యర్థులతో మాట్లాడినా వారి జవాబు పత్రాలు పరిశీలించబోమని హెచ్చరించింది. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించింది. ఇటీవల జూనియర్ లైన్ మెన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ దృష్ట్యా బోర్డు కఠినంగా వ్యవహరించనుంది. కాగా ఆగస్టు 7న జరిగే ఎస్సై పరీక్షకు శనివారం హాల్ టికెట్లు విడుదలయ్యాయి.