ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా పలు దేశాల్లో సేవలు స్తంభించాయి. అవుట్ లుక్, ఎంఎస్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ వంటి 365 రకాల సేవలు పనిచేయడం లేదు. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడుతున్నారు.భారత్, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, UAE, దేశాల్లో నిలిచిపోయాయి. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు అందుతుండటంతో మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. సమస్యకు గల కారణాలను అన్వేషిస్తోంది.