చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా గాయం కారణంతో ఐపీఎల్ సీజన్-15కి దూరమయ్యాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడికి విశ్రాంతి ఇచ్చామని జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు. సీజన్ ప్రారంభంలో చెన్నై జట్టుకు సారథిగా వ్యవహరించిన జడ్డూ.. జట్టు వరుస పరాజయాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. ప్రస్తుతం జట్టును కెప్టెన్ కూల్ ధోని నడిపిస్తున్నాడు.