మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మూవీ ‘ఆచార్య’. ఏప్రిల్ 29న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన ప్రతీచోట నెగిటివ్ టాక్ రావడంతో.. పెట్టుబడిలో కేవలం 25 శాతం మాత్రమే వసూలు చేసిందని సమాచారం. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారని, తమను ఆదుకోవాలని కోరారు కూడా. అందులో భాగంగానే రాజ్‌గోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి లేఖ రాశారు. ఇప్పటికే కరోనా వల్ల నష్టపోయానని, ఈ మూవీ కోసం అప్పు చేసి పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు భారీగా నష్టపోవడంతో దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నానని పేర్కొన్నారు. తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.