వివాహ బంధానికి స్వస్తి పలికేందుకు మరో సంపన్న జంట సిద్ధమైంది. గూగుల్ సహవ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ ఆయన భార్య నికోల్ షనాహన్ విడాకులు తీసుకుంటున్నారు. సెర్జీ బ్రిన్ ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత మూడేళ్లలో విడాకులు తీసుకున్నకుబేరుల జంటల్లో వీరు మూడోవారు. సెర్జీ బ్రిన్, నికోల్ లు 2018లో ఒక్కటయ్యారు. వీడికి మూడేళ్ల కుమార్తె ఉంది. విరుద్ధ అభిప్రాయాల కారణంగా పరస్పరం విడాకులు కోరుకుంటున్నట్లు న్యాయస్థానానికి వివరించారు.