యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఎ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. ఎ.ఎం రత్నం తనయుడు రత్నం కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అమ్రేష్ గణేశ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.