‘డీజే టిల్లు’ సినిమా రీసెంట్గా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సొంతం చేసుకుంది. మార్చి 4 నుంచి మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొత్తం దాదాపుగా రూ.30 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ చూస్తే రూ.17 కోట్లుగా ఉన్నాయి. రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అదే రోజు విడుదలైన రవితేజ ఖిలాడి కలెక్షన్స్ను బీట్ చేసింది.