ఇటీవల వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా అంచనాలకు మించి సక్సెస్ అయింది. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో పడ్డారట మేకర్స్. ఈ సినిమా కథను డైరెక్టర్ విమల్ కృష్ణ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కలిసి రాశారు. అయితే సిద్ధు ఇప్పుడు సీక్వెల్‌కు కథ రాసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం సిద్ధు డీజే టిల్లును నిర్మించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కోసం తన తదుపరి చిత్రం షూటింగ్ చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే డీజే టిల్లు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది.