వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని అధికారులను ఆదేశించింది. సోమవారం వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.