ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటీవలే ఆర్థికపరమైన అంశాలపై కొరఢా ఝళిపించగా తాజాగా ఆ దేశంతో ఎలాంటి క్రీడా టోర్నీలు కూడ ఆడబోమని పలు దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఫిన్లాండ్ వేదికగా మేలో జరగనున్న ఐస్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో రష్యాను నిషేధించాలని అతిథ్య జట్టు సమాఖ్యను కోరుతుంది. అలాగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలీఫయింగ్ మ్యాచులో కూడ పోలెండ్, చెక్, స్వీడన్ దేశాలు రష్యాతో ఆడబోమని స్పష్టం చేశాయి. యుద్ధం ఇలానే కొనసాగితే ఒలింపిక్ సంఘం నుంచి రష్యాను బహిష్కరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.