వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించకూడదని ఏపీ డీఎంఈ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘ ఎంబీబీఎస్, పీజీ స్టూడెంట్స్ చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలి. శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలి. క్లీన్ షేవ్ చేసుకోవాలి. విద్యార్థినులు జడలు వేసుకోవాలి. ఖచ్చితంగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలి. అసిస్టెంట్, అసొసియేట్, ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ విధిగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే’’ అంటూ ఆదేశించారు. కాగా ఫేస్ రికగ్నేషన్ హాజరు విధానాన్నిఅమలు చేయాలని నిర్దేశించారు.