• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL: ఆర్సీబీకి చావోరేవో..

    నేటి ఐపీఎల్ మ్యాచులో ఆర్సీబీ VS గుజరాత్ టైటాన్స్ పోటీపడుతున్నాయి. నేడు ఆర్సీబీ జట్టు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. గెలిచినా కానీ ఆ జట్టు భారీ తేడాతో నెగ్గాలి. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. టాప్ ఆర్డర్లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ, చివర్లో దినేష్ కార్తిక్ మెరిస్తేనే భారీ స్కోర్లు వస్తున్నాయి. లేదంటే ఆ జట్టు నామమాత్రపు స్కోర్లకే పరిమితమవుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టును చూసుకుంటే ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో పటిష్ట గుజరాత్ ను ఆర్సీబీ భారీ తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ చేరుకుంటుందా? అని పలువురు ఆర్సీబీ అభిమానులు బెంగ పడుతున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు.