ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ‘చాట్‌జీపీటీ’ తనదైన శైలిలో పరిష్కారం చెప్పింది. మధ్యవర్తిత్వంపై భారత విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్ చాట్‌జీపీటీని అడిగారు. ‘ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు చాలా క్లిష్టమైనవి. దీనిపై ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కాస్త సవాలే. చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాలు ఒప్పందాలపై అంతర్జాతీయ పర్యవేక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ వంటి అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించొచ్చు’ అని చాట్‌జీపీటీ సమాధానమిచ్చింది.