వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కొండా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. కొండా మురళి, సురేఖ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 23వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆసక్తికర వార్తను పంచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. దేవుడిని నమ్మని రాము పేరులో ‘రాముడు గోపాలుడు’ అనే పేర్లు ఎందుకు ఉన్నాయనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా తన అసలు పేరు ‘రామ్ పండు’ అని స్కూల్‌లో ఆ పేరు చెప్పి అందరూ ఏడిపిస్తుంటే దానిని తన నాన్న ‘రామ్ గోపాల్ వర్మ’గా మార్చారని చెప్పుకొచ్చాడు.