టికెట్లు బ్లాక్‌లో అమ్మితే ఏం జరుగుతుందో తెలుసా?

Paytm insider

ఆదివారం ఉప్పల్‌ జరిగబోయే ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్లకు ఎంత డిమాండ్‌ ఉందో తెలిసిందే. అనేక మంది టికెట్ల కోసం లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. అయితే కొంతమందికి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరికాయి. వారిలో కొందరు ఈ టికెట్లను ఎక్కువ ధరకు బ్లాక్‌లో అమ్ముకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. కానీ బ్లాక్‌లో టికెట్‌ అమ్మితే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చాలామందికి తెలియదు. IPC సెక్షన్‌ 405,406 ప్రకారం బ్లాక్‌లో టికెట్లు అమ్మడం నేరం. దీనికి జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలుశిక్ష కూడా పడుతుంది. ఇవాళే హైదరాబాద్ సీపీ మాట్లాడుతూ ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మితే 100కు కాల్‌ చేయాలని చెప్పారు. జాగ్రత్త మరి!! కక్కుర్తి పడి కటకటాల పాలు కావొద్దు.

Exit mobile version