లక్కుంటే లచ్చిందేవి లంకె బిందెలతో లగెత్తుకొస్తది అన్నట్లు … అదృష్టం తమిళనాడులో ఓ వైద్యుడిని కోటీశ్వరుడిని చేసింది. తిరునాళ్లకు వెళ్లి సరదాగా లాటరీ కొంటే ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. కన్యాకుమారికి చెందిన డా. ప్రదీప్ కుమార్..కేరళలోని విషు ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన లాటరీలో ఓ టికెట్ కొన్నాడు. అది కాస్తా డ్రాలో ఎంపికవడంతో ప్రస్తుతం ఈ డాక్టరు తన లక్కును తానే నమ్మలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.