విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కరోనా శాపంగా మారింది.చైనాలో కొవిడ్ నిబంధనలతో సుమారు 23 వేల మంది మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇందులో 18 వేల మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. కేవలం 400 మంది మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరగటంతో మిగతావారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రష్యాలో చదువుతున్న వారి దుస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది. యుద్ధం కారణంగా ఆన్లైన్ తరగతులు విని పరీక్షలు రాస్తున్నారు.