వైద్యుల నిర్లక్ష్యమే తల్లి కడుపులో బిడ్డ మృతికి కారణమంటూ.. హైదరాబాద్ చాదర్‌ఘాట్ లో ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. అంబర్‌పేట గోల్నాకకు చెందిన ఫాతిమా(24) కాన్సు కోసం ఈనెల 24న చాదర్‌ఘాట్ లోని ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. 26న సాయంత్రం 3 గంటలకు పురిటి నొప్పులకు కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో ఆమెకు రాత్రి 9 గంటలకు నొప్పులు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులెవరూ అందుబాటులో లేరని.. వారంతా ఆసుపత్రి టెర్రస్‌పైన విందులో.. మ్యూజిక్ సిస్టం పెట్టుకొని నృత్యం చేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట తర్వాత వచ్చిన వైద్యులు.. ఫాతిమాను పరీక్షించి కడుపులోని శిశువు మృతి చెందిందని చెప్పారన్నారు. ఆసుపత్రిని మూసేయాలంటూ బాధితులు ఆందోళన చేశారు.