బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో ఉన్న నీటి లభ్యతను వాడుకోలేని కేసీఆర్ దేశంలోని నీటి లభ్యత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘అగ్నిపథ్ నియామకాలపై మాట్లాడే హక్కు సీఎంకు లేదు. అగ్నిపథ్ ఆలోచన బిపిన్ రావత్ ఆలోచన. ఆయనకంటే ఎక్కువ తెలుసా? గతంలో కేసీఆర్కు మద్దతు తెలిపిన కుమారస్వామి, నితీశ్ కుమార్లు ఎక్కడ? ఒకసారి వచ్చిన నేతలు మళ్లీ కేసీఆర్తో కలవడానికి రారు. కేజ్రీవాల్, పినరయి విజయన్ కూడా అంతే’ అంటూ ఎద్దేవా చేశారు.