కుక్కలను పెంచుకుంటే పన్ను విధింపు
మధ్యప్పదేశ్లోని సాగర్ మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. పెంపుడు కుక్కలను పెంచుకునేవారిపై పన్ను విధించింది. సాగర్ నగరంలో పెంపుడు కుక్కల దాడులు ఎక్కువయ్యాయని ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో శుకనకాలను తీసుకొచ్చి మలమూత్ర విసర్జన చేయడం కూడా ఎక్కువైందన్నారు.దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నట్లు వెల్లడించారు. అందుకే కుక్కలకు రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, పన్ను విధింపు తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు.