దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. ఉదయం 414 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 180 పాయింట్ల ప్రాఫిట్‌తో 58,080 వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ సైతం 53 పాయింట్లు బలపడి 17,166 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ విప్రో, రిలయన్స్, టెక్ మహీంద్రా, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.30 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్లకు పడిపోయింది.